- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏం బిచ్చం వేస్తున్నారా?.. కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం కౌంటర్
కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ డైరెక్షన్ లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. ఆదివారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన పొన్నం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో (Jubilee Hills bypoll) బీజేపీ అభ్యర్థికి కనీసం 10 వేల ఓట్లైనా వస్తాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి (Kishan Reddy) ఏం చేశారో చెప్పాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎనని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి, నిధుల విషయంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి కేజీకి రూ. 40 రూపాయలు ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పడం లేదన్నారు. ఇవాళ తాను చాలెంజ్ చేస్తున్నానని సన్నబియ్యంలో ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 40 శాతం వాటా ఉందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పొన్నం కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఇస్తున్నామని చెబితే ఏదో రాష్ట్రానికి బిక్షం వేస్తున్నారా? మేము పన్నులు చెల్లించడం లేదా అని మండిపడ్డారు. కిషన్ రెడ్డి తన భాషను సరిగాఉపయోగించాలన్నారు. మేము ఇచ్చిన పన్నులలోంచే మాకు ఇస్తుంటూ మళ్లీ దౌర్జన్యంగా మాట్లాడట ఏంటని మండిపడ్డారు. కిషన్ రెడ్డి మాటల ఫెడరల్ సిస్టమ్‍కు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.






