- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి... ఖండించిన మంత్రి పొన్నం
by Kema Shiva Kumar |
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీతో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై దాడి ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం మనోధైర్యాన్ని కల్పించారు.
Next Story






