Minister Ponnam: బీఆర్ఎస్ నేతల్లారా.. ముక్కు నేలకు రాయండి: మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-01-18 06:22:28.0  )
Minister Ponnam: బీఆర్ఎస్ నేతల్లారా.. ముక్కు నేలకు రాయండి: మంత్రి పొన్నం హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పవర్ కోల్పోగానే నేడు ధర్నాలు చేయడం హస్యాస్పదంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR)పై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కరీంనగర్‌ (Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ.. కేసులు, అవినీతి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ (KTR) దొంగ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ (BRS) ఆర్థిక విధ్వంసం వల్లే రాష్ట్రంలో నేడు సంక్షేమ పథకాల అమలు అలస్యం అవుతున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసే ముందు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ముక్కు నేలకు రాయాలని.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయామని ప్రజలకు చెప్పాలన్నారు. అలా చేస్తేనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందని సెటైర్లు వేశారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ఆరోగ్య శ్రీ (Aarogya Sree), ఇంటింటికి ఉచిత విద్యుత్ (Free Power), సన్న వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ (Gas cylinder), రైతుల కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, రైతు భరోసా (Raithu Bharosa) కింద ప్రతి రైతులకు పెట్టుబడి సాయం రూ.12 వేలు లాంటి ప్రజా రంజక పథకాలను తమ ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed