- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponnam: బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
జీహెచ్‌ఎంసీ (GHMC) బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ (BRS) అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ (GHMC) బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ (BRS) అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రావడం హైదరాబాద్ నగరం (Hyderabad City) అభివృద్ధిలో పరుగులు పెడుతోందని అన్నారు. నగరం బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేందుకు సీఎం, మంత్రులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. మేయర్ విజయలక్ష్మి (Mayor Vijaya Lakshmi)పై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉంటుందని, కానా.. ఆ అవిశ్వాసాన్ని ఎదుర్కోనే సత్తా తమకు ఉందని ప్రధాన ప్రతిపక్షానికి సవాలు విసిరారు. బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకోవడం హైదరాబాద్ (Hyderabad) నగాభివృద్ధికి అడ్డుపడినట్లేనని అన్నారు. బడ్జెట్ సమావేశాలు బీఆర్ఎస్ (BRS) అడ్డుకోవడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) స్పందించాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకులకు కడుపు మంటగా ఉన్నట్లుందని సెటైర్లు వేశారు.
కాగా, ఇవాళ జరిగిన జీహెచ్‌ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలపై బీఆర్ఎస్ (BRS) పట్టుబట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను తీసుకువచ్చి సభను నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన హంగామాపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు.






