సబర్మతి నది తీరంలో నేతల పడవ ప్రయాణం.. మూసీ కూడా! మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-04-10 11:19:09  IST  )

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

సబర్మతి నది తీరంలో నేతల పడవ ప్రయాణం.. మూసీ కూడా! మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ నది (Musi River) ప్రక్షాళన, సుందరీకరణ పై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని (Sabarmati River) సబర్మతి నదిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ ఖాతా వేదికగా సబర్మతి నది తీరంలో పడవ ప్రయాణం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అందులో భాగంగా సబర్మతి మాదిరి మూసీ అభివృద్ధికి చేసే అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

త్వరలోనే పార్టీలకు అతీతంగా జీహెచ్ఎంసీ మేయర్,హైదరాబాద్ లో ఉన్న 150 మంది కార్పోరేటర్లు సబర్మతి స్టడీ టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. సబర్మతి నది మాదిరి మూసీ నది పునరాభివృద్ధికి ఫేజ్ -1 కింద బాపు ఘాట్ వరకు చేసే అభివృద్ధి పై జీహెచ్ఎంసీ బృందం స్టడీ టూర్ ద్వారా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.

Next Story