Ponnam vs Adluri: ఐయాం సారీ.. అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం క్షమాపణలు

by Prasad Jukanti |

తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య రేగిన వివాదానికి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‍తో ఫుల్ స్టాప్ పడింది.

Ponnam vs Adluri:  ఐయాం సారీ..  అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం క్షమాపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మధ్య చెలరేగిన వివాదం సద్దుమణిగింది. అడ్లూరి లక్ష్మణ్‍కు మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పారు. అడ్లూరి లక్ష్మణ్‍ను తాను ఏమి అనలేదని నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దానికి అడ్లూరి బాధపడితే వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదన్నారు. మంత్రి అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదని అన్నారు. కాగా ఇరువురు మంత్రుల మధ్య వివాదం నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం, అడ్లూరి ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రుల మధ్య టీపీసీసీ చీఫ్ సయోధ్య కుదిర్చారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

Next Story