- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti: బీఆర్ఎస్ నేతల వద్ద ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు.. మంత్రి పొంగులేటి సెన్సేషనల్ కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‍కు పట్టం కట్టబోతున్నారని గ్రహించే ఆ ఫ్రస్ట్రేషన్‍లో మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), మిగతా ముఖ్యనేతలపై నోరుపారేసుకుంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిప్డారు. బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్‍తో మాట్లాడుతున్నారని వీరి సంస్కారాన్ని గమనించిన రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంపై కేటీఆర్ (KTR) అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనూ చాలెంజ్ లు చేసి, రెఫరెండమని మాట్లాడి జూబ్లీహిల్స్ లో భంగపడ్డారన్నారు. మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలవబోతోందనే బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారన్నారు. 80 శాతానికి పైగా మున్సిపాలిటీలను గెలుస్తామన్నారు.
ఇప్పటికీ బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది:
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల వద్ద ఉన్నట్లు అనిపిస్తోందని లేకుంటే నేను కాన్ఫరెన్స్ కాల్‍లో ఏం మాట్లాడానో మీరు ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‍గా తీసుకుంటుందన్నారు. ఇంకా ఎన్ని పరికరాలు ఏయే మామిడితోటలు, ఫామ్ హౌస్‍లు, ఇళ్లలో ఉన్నాయో? ఫోన్ కాల్స్ ఇంకా ఎంత మంది వింటున్నారో ఎంక్వైరీ చేసి అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అధికారంలో ఉండగా బెదిరింపులకు పాల్పడిన వారికి మేము ఓట్లు అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడినట్లు భావన కలుగుతోందని విమర్శించారు. సామాన్య ప్రజలకు హక్కు ఉన్నట్లుగానే ఉద్యోగులకు కూడా తమ ఓటును వినియోగించుకునే హక్కు ఉందన్నారు. అధికారులను ఓటు అడగడంలో తప్పేముందన్నారు.
సంక్షేమం, అభివృద్ధిపై ఫోకస్:
తమ ప్రభుత్వం రెండేళ్లుగా పేదవాడికి అండదండగా నిలిచేలా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన పాలసీలు తీసుకువచ్చి విద్యా, వైద్యానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి వరకు నిరుద్యోగులకు 71 వేల ఉద్యోగులకు ఇచ్చామని, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా ఇస్తూ రైతులను రాజును చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు ఎక్కడ తగ్గకుండా పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెల్లాచెదురు చేస్తే తాము వచ్చి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు.
సీఎం రేస్‍పై..
నేను సీఎం రేస్‍లో లేనని అనేక సందర్భాల్లో చెప్పానని పార్టీలో నేను ఒక సామాన్య కార్యకర్తను మాత్రమేనన్నారు. తాను సీఎం రేస్ లో ఉన్నట్ల కొందరు వ్యాఖ్యలు చేయడంపై ఎవరి అభిమానం వారిదని అన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల పెంపు, తగ్గింపు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. అయితే గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కమిటీని ఏర్పాటు చేసి ఆ నివేదికను అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ చర్చకైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు.






