- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: బొమ్మలు చూపెట్టి వెళ్లిపోయే ప్రభుత్వం కాదు.. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి సెటైర్లు
రేవంత్ రెడ్డి నాయకత్వంలో జోడెద్దుల్లా సంక్షేమం, అభివృద్ధి దూసుకుపోతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గత ప్రభుత్వం అమలు చేశామని చెప్పుకుంటున్న కార్యక్రమాలు వేటిని పక్కన పెట్టకుండా అదనంగా కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గత ప్రభుత్వంలో దొరవారు చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి ప్రతి నెల రూ.6500 కోట్లు కడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో సంక్షేమం, అభివృద్దిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నలుగురు వ్యక్తులు తమ స్వార్థం కోసం ధరణిని తీసుకువచ్చారు. దీంతో ప్రజలను హింసపెట్టారు. కానీ మేమొచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామని దాని స్థానంలో అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. మీ గ్రామానికే రెవెన్యూ అధికారులు వచ్చి భూసమస్యలు పరిష్కరిస్తారని.. ఏ ఒక్కరూ కూడా ఆలి మెడలో తాళి అమ్ముకుని కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుడా భూభారతి చట్టాన్ని తెచ్చుకున్నామన్నారు.
బొమ్మలు చూపెట్టి వెళ్లిపోయే ప్రభుత్వం కాదు:
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా బొమ్మలు చూపించి వెళ్లిపోయే ప్రభుత్వం మాది కాదని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రాబోయే మూడేళ్లలో సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, పేదల కోరికను నెరవేర్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఎవరికైనా ఇందిరమ్మ ఇళ్లు రాకపోతే కంగారుపడవద్దని సూచించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకరమైన ప్రేమ, అభిమానం చూపించారో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి స్థానిక నాయకులు, అభిమానులు, ప్రజలు అదే రకమైన ప్రమాభిమానాలు చూపించాలని విజ్ఞప్తి చేశారు.






