- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ జయంతి నాటికి వారి సేవలు అందుబాటులోకి వస్తాయి.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
గాంధీ జయంతి నాటికి వారి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల (Licensed Surveyors) సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanti) నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మొదటి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయిందని రెండో విడత శిక్షణ 23 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్ధులు ఆయా జిల్లాల్లో 18వ తేదీ ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు. లైసెన్స్ డ్ సర్వేయర్ల నియామకంపై ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ (Bhu Bharati Act) భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపధ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను గాంధీ జయంతి రోజునాటికి అందుబాటులోకి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి మే 26 నుంచి జూలై 26 వరకు 50 పనిదినాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో ఏడు వేల మందికి శిక్షణ (training) ఇవ్వడం జరిగిందని, గత నెల 28,29 తేదీల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించామన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్దులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ శిక్షణ పూర్తయిన వెంటనే వీరికి లైసెన్స్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీరి సేవలను పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా సర్వే మాన్యువల్‌ను రూపొందించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వే విభాగం బలోపేతం తోనే రెవెన్యూ వ్యవస్ధలో మెరుగైన సేవలు అందించగలుగుతామని దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని అన్నారు. గత పదేళ్ళలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.






