- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగాల భర్తీపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రారంభించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే కనకయ్యతో కలిసి ఐఎన్‌టీయూసీ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రచారం నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రారంభించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే కనకయ్యతో కలిసి ఐఎన్‌టీయూసీ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలువురు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు ఐఎన్‌టీయూసీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. కార్మికుల వైద్య అవసరాలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. కారుణ్య నియామకాలు నిష్పక్షపాతంగా చేపడుతామని అన్నారు. అంతేకాదు.. కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరుస్తామని భరోసా ఇచ్చారు.
Next Story






