- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి BIG అప్‌డేట్
ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Illu) లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సచివాలయం వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Illu) లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సచివాలయం వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని చెప్పారు. గ్రామసభల్లో పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని సూచించారు. త్వరలోనే సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకం ఉంటుందని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని కీలక ప్రకటన చేశారు. స్థలం ఉన్నవారికి తొలి విడతలో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. రెండో విడతలో ఇంటి స్థలంలో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు అత్యంత కీలకమైనది. ఈనెల 26 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇటీవలే ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. తొలి విడతలో 20 లక్షల ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.






