ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు.

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సదస్సు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు. భూభారతి చట్టంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ములుగుమాడులో చేపట్టిన భూముల రీసర్వేను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో చేపట్టబోయే భూముల రీసర్వే ప్రక్రియను మంత్రులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని తెలిపారు. అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మళ్లీ రైతుభరోసా అందిస్తామని తెలిపారు. అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వంపై కారు కూతలు కూసే వారికి ప్రజలు మరోసారి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత సర్కార్‌ తెచ్చిన ధరణి చట్టంతోనే తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. భూమిలేని పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తామని భట్టి తెలిపారు.

Next Story