- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగ్జిట్ పోల్స్ పేరుతో బీజేపీ మైండ్ గేమ్: మంత్రి పొంగులేటి ఫైర్
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. మరి కొన్ని గంటల్లో దేశంలో ఏ పార్టీ అధికారం పీఠం దక్కించుకోబోతుందనే విషయం తేలనుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. మరి కొన్ని గంటల్లో దేశంలో ఏ పార్టీ అధికారం పీఠం దక్కించుకోబోతుందనే విషయం తేలనుంది. ఇప్పటికే ఓటర్ల నాడీ పసిగట్టి పలు ప్రైవేట్ సర్వే సంస్థలు, నేషనల్, లోకల్ మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్‌ను క్రోడికరిస్తే దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమినే మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని స్పష్టం అయ్యింది. ఇండియా కూటమికి మరోసారి నిరాశ తప్పదని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ నివేదికులు అంచనా వేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ఆయన ఓ టీవీ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ పేరుతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఫైర్ అయ్యారు. ఈవీంఎంలపైన కూడా తమకు అనుమానాలు ఉన్నాయని పొంగులేటి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 8 స్థానాలు విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మరో 5 చోట్ల బీఆర్ఎస్, బీజేపీతో టఫ్ ఫైట్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు రావని.. ఆ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బలంగా ఉందని పేర్కొన్నారు.






