- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponguleti: మాటిస్తున్నా చెల్లెమ్మా.. మంత్రి పొంగులేటి ఆసక్తికర ట్వీట్
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో (rationcard) కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కొత్తగా 5.61 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది. అయితే, కొత్త రేషన్ కార్డు తీసుకోని లబ్ధిపొందిన మహిళ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), మంత్రి శ్రీధర్ బాబు ముందు ఆ మహిళా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే మహిళ మాట్లాడిన వీడియోను మంత్రి పొంగులేటి సోమవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నేను మా ఇంట్లో (BRS) బీఆర్ఎస్ నాయకులు ఉన్న కూడా కాంగ్రెస్ (Congress) వస్తేనే నా లైఫ్ మారుతుందని అనుకున్నా.. మా ఇంట్లో అందరినీ ఎదురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నాకు పిల్లలతో సహా రేషన్ కార్డు వచ్చింది.. థాంక్యూ సార్’ అని ఆ మహిళ తన ఆనందాన్ని పంచుకుంది.
ఈ మహిళ వీడియోను మంత్రి పొంగులేటి ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ‘మాటిస్తున్నా చెల్లెమ్మా.. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓటు వేసిన మీలాంటి చెల్లెమ్మల నమ్మకాన్ని నిలబెట్టేలా సంక్షేమ పాలన అందిస్తది మన ప్రజా ప్రభుత్వం’ అని మంత్రి రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్‌లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. నిరుద్యోగులకు కూడా హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని నెటిజన్‌లు మంత్రికి రిక్వెస్ట్ చేశారు.






