ఆ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు : మంత్రి పొంగులేటి

by velandi.Saikiran |

భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ( Manmohan Singh ) అరుదైన గౌరవం దక్కింది. ఓ యూనివర్సిటీ కి మన్మోహన్

ఆ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు : మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ( Manmohan Singh ) అరుదైన గౌరవం దక్కింది. ఓ యూనివర్సిటీ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana State Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy) అధికారిక ప్రకటన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి (Earth Science University) మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు.. వెల్లడించారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

ఇవాళ తెలంగాణ కేబినెట్ ( Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు గంటల పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుని తెలంగాణ రాష్ట్ర కేబినెట్. ఇక ఈ నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ ( (Former PM Manmohan Singh ) ) పేరు పెడుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని... అలాంటి మహోన్నత వ్యక్తికి.. గౌరవం దక్కాలని నేపథ్యంలో పేరు పెడుతున్నట్లు వివరించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల.. సర్వత్ర ప్రశంశల వర్షం కురుస్తోంది.

Next Story