జాబితా అడిగేది ఫ్రేమ్ కట్టించుకోవడానికి కాదు.. కలెక్టర్లపై మంత్రి పొంగులేటి ఫుల్ సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-29 14:40:55  IST  )

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లపై(Collectors) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాబితా అడిగేది ఫ్రేమ్ కట్టించుకోవడానికి కాదు.. కలెక్టర్లపై మంత్రి పొంగులేటి ఫుల్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లపై(Collectors) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Illu) లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా లిస్ట్ ప్రకటించకపోవడం ఏంటి ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని సీరియస్ అయ్యారు. జూన్ 6వ తేదీ లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి ఆదేశించారు. జూన్ 6 కటాఫ్ డేట్‌గా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పథకం పరుగులు తీస్తోంది. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కొన్ని గృహాలైన ప్రారంభించేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. లబ్ధిదారుల్లో కొందరు ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకుంటుండగా, మరికొందరు తాత్కాలిక నిర్మాణాలను తొలగించి నిర్మాణం చేపడుతున్నారు.

Next Story