Minister Ponguleti Srinivas Reddy : ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) మరోసారి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు.

Minister Ponguleti Srinivas Reddy : ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) మరోసారి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. గత BRS ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు(Ration Cards) కూడా జారీ చేయలేదని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 3.54 లక్షల రేషన్ కార్డులను జారీ చేస్తోందని పేర్కొన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు అర్హులైన వారికి నిరంతరం అందజేస్తామని తెలిపారు. అలాగే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు.

ఈ పథకం కింద మొదటి దశలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. 18.32 లక్షల మంది లబ్ధిదారులను ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించామని, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతకు ఇదే నిదర్శనం అన్నారు.

Next Story