మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం: మంత్రి పొంగులేటి

by Ajay Maddhiboyina |

ఖ‌మ్మంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు అత్య‌ధిక మెజార్టీతో గెల‌వ‌డం ఖాయం అని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం: మంత్రి పొంగులేటి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఖ‌మ్మంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు అత్య‌ధిక మెజార్టీతో గెల‌వ‌డం ఖాయం అని అన్నారు. పేద‌ల‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాలు ఇవ్వ‌డం వ‌ల్ల‌నే పంచాయితీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌ను గెలిపించార‌ని అన్నారు. అదే విధంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను దీవించ‌డానికి ఓట‌ర్లు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర‌వాత ప‌దేళ్లు దొర‌లపాల‌న చేసిన వాళ్ల‌కు అర్బ‌న్ పై కూడా న‌మ్మ‌కం పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున నిల‌బ‌డిన అభ్య‌ర్థులు క‌చ్చితంగా గెలుస్తారు అనే న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టి ఎక్కువ‌మంది టికెట్లు ఆశిస్తున్నార‌ని అన్నారు. టికెట్ రానివాళ్లు కూడా అర్థం చేసుకుంటార‌ని అధికారంలో ఉన్నాం కాబ‌ట్టి ఒక కౌన్సిల‌ర్, వార్డు మెంబ‌ర్ టికెట్ రానంత‌మాత్రాన బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. టికెట్ రానివాళ్ల‌కు న్యాయం చేసేలా కాంగ్రెస్ ప‌నిచేస్తుంద‌ని అన్నారు.

Next Story