కాళేశ్వరం పేరుతో అధికారం రుచి చూడాలనే ఆరాటం.. కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి కౌంటర్

by Prasad Jukanti |

తమకు అధికారం అప్పగించాలంటూ కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.

కాళేశ్వరం పేరుతో అధికారం రుచి చూడాలనే ఆరాటం.. కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం చుట్టూ జరుగుతున్న విమర్శలు ప్రతి విమర్శలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రైతుల గోడును పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయడం లేదని ప్రభుత్వానికి చేతకాకపోతే వారం రోజుల పాటు ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించండి, రైతులకు నీరందిస్తామని కేటీఆర్, తనకు ఓ మూడు నెలలు నీటిపారుదల శాఖను అప్పగిస్తే కాళేశ్వరం అంటే ఏమిటో చూయిస్తానంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి.. దొంగ "తాళం చెవులు కూడా నాకే ఇవ్వండి" అన్నట్టుగా హరీశ్ రావు, కేటీఆర్‌ల కోరిక ఉందన్నారు.

అధికార రుచి చూడాలనే ఆరాటం:

బీఆర్ఎస్ పార్టీపై పట్టుకోసం బావబామ్మర్దుల ఆధిపత్య పోరు ఫామ్‌హౌస్‌ నుంచి కాళేశ్వరం వరకు చేరిందని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న విషయం అగ్గిపెట్టె రావు, డ్రామారావులకు అర్థమైనట్టుందిన్నారు. అందుకే ఒకరు 'వారం రోజులు', మరొకరు 'మూడు నెలలు' అంటూ... కనీసం కాళేశ్వరం పేరుతోనైనా కొద్దిరోజులు అధికార రుచి చూడాలనే ఆరాటం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు గారూ... అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పెండింగ్ కమీషన్లు ఉన్నాయా? వాటి వసూలు కోసమేనా మూడు నెలలు ఇరిగేషన్ మంత్రి బాధ్యత ఇవ్వండి అంటున్నారు.. ఇంత పదవి వ్యామోహమా? అని ప్రశ్నించారు.

Next Story