అది చేసి చూపకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయను.. కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి కౌంటర్

by Prasad Jukanti |

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

అది చేసి చూపకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయను.. కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో మా ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని, చెప్పినట్లు మేము ఎక్కువ ఇండ్లు కట్టి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖనే పూర్తిగా డిస్మాండిల్ చేశారని, ఏనాడైనా పేదవారి ఆలోచనలను పరిగణలోకి తీసుకున్నారా అని నిలదీశారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటే ఎక్కువ సంఖ్యలో ఈ రెండున్నరేళ్లలో కట్టి చూపిస్తామన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్‍గా తీసుకుని పేదలు నివసించే ప్రాంతంలోనే ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందన్నారు.

Next Story