- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. పండుగపూట ముస్లింలకు కీలక హామీ
వరంగల్ తూర్పు నియోజకవర్గం(Warangal East Constituency)లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో(Ramadan Celebrations) అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పాల్గొన్నారు.

దిశ, వెబ్డెస్క్: వరంగల్ తూర్పు నియోజకవర్గం(Warangal East Constituency)లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో(Ramadan Celebrations) అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పాల్గొన్నారు. పట్టణంలోని మట్టేవాడ, ఎల్బీనగర్, ఖిలా వరంగల్, ఈద్గాల్లో ముస్లింల సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడు పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Govt) ముస్లింల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రలోని ముస్లింలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. మంత్రిగా ఈద్గా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనటం సంతోషాన్నిచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లా(Allah)ను ప్రార్థించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.






