- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా హృదయం ద్రవించిపోయింది : ఏపీ మంత్రి నారా లోకేష్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును మితిమీరిన వేగంతో దూసుకొచ్చి గుద్దడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు మృతిచెందిన విషయం తెలిసి తన హృదయం ద్రవించిపోయిందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మృతులకు అశృనివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
READ MORE .....
మీర్జాగూడ బస్సు ప్రమాదం.. మృతులకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం
Next Story






