- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ మా అధ్యక్షుడు ఆయన సినిమాను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాం.. మంత్రి నాదెండ్ల షాకింగ్ కామెంట్స్
పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమాను జనేసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమోట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమాను జనేసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమోట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చూడాలని కొందరు నాయకులు టికెట్లు కూడా పంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి నాందెండ్ల సినిమా కోసం ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్షరెన్స్ ఏర్పాటు చేసి మరీ సినిమాను చూడాలని కోరారు. ప్రతిఒక్కరికీ సినిమా చూపించాలని పవన్ కల్యాణ్ ఇమేజ్ పెరిగేలా చూడాలన్నారు.
అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా ఆయన ఓ సమావేశంలో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తమ పార్టీ అధ్యక్షుడు అని అందుకే ప్రమోట్ చేశామని చెప్పారు. మా పార్టీ అధ్యక్షుడు చేసిన సినిమా ప్రమోట్ చేయకుంటే వాళ్ల పార్టీ వాళ్లు చేసిన సినిమాను ప్రమోట్ చేస్తామా అని ప్రశ్నించారు. కచ్చితంగా ప్రమోట్ చేస్తామని అది హిస్టారికల్ సినిమా అని ప్రతిఒక్కరు చూడాలి కాబట్టి జనాల్లోకి వెళ్లాలని ప్రమోట్ చేశామన్నారు.






