రాజకీయం అంటే రాజకీయమే.. మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్‌ అజారుద్దీన్‌‌కు మంత్రి పదవి ఇవ్వడంపై అనేక విమర్శలు వచ్చాయి

రాజకీయం అంటే రాజకీయమే.. మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-elections) వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్‌ అజారుద్దీన్‌‌ (Mohammad Azharuddin)కు మంత్రి పదవి ఇవ్వడంపై అనేక విమర్శలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శించాయి. ఈ విమర్శలపై రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌ తన మంత్రి సమాధానమిచ్చారు. “మంత్రివర్గంలో నాకు అవకాశం ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి ఉద్దేశం మైనారిటీల అభ్యున్నతి. సీఎం మైనారిటీల కోసం చేసిన సేవలను కొందరు గుర్తించకపోవడం బాధాకరం. కానీ ఆయన నిజంగా ఎంతో చేశారని నేను చెప్పగలను,” అని అన్నారు. అలాగే “ప్రపంచకప్‌ విజయం తర్వాత సిరాజ్‌ను డీఎస్పీగా నియమించిన సందర్భం గుర్తుంచుకోండి.

సీఎం రేవంత్ ఎల్లప్పుడూ అవసరమైన చోట సరైన వ్యక్తులను నియమిస్తారు. నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను సిఫార్సు చేసిన నా సహచరులకు, ఎన్నికల్లో టికెట్ ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు” అని తెలిపారు. అలాగే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలు, ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ.. “రాజకీయాలు అంటే రాజకీయాలే. ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా అదే నిజమని అనుకుంటే, దానిలో తప్పేముంది? జూబ్లీహిల్స్‌లో మైనారిటీ జనాభా ఎక్కువగా ఉంది. ప్రతి పార్టీ రాజకీయంగా లాభం పొందేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ముఖ్యమంత్రి చేసినది ఒక మాస్టర్‌స్ట్రోక్‌ అని చెప్పాలి” అని ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్‌‌ వ్యాఖ్యానించారు.

Next Story