- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిజర్వేషన్ల చట్ట బద్ధత కల్పిస్తాం : బీసీ సంఘాల నేతలతో మంత్రి పొన్నం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో గురువారం బీసీ సంఘాల నేతలు, మేధావులు , ఫ్రొఫెసర్లు సమావేశమయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో గురువారం బీసీ సంఘాల నేతలు, మేధావులు , ఫ్రొఫెసర్లు సమావేశమయ్యారు. డాక్టర్బీఆర్అంబేద్కర్ సచివాలయంలోని మంత్రి ప్రభాకర్ఛాంబర్నేతలు భేటీ అయి బీసీ కుల గణన.. 42 శాతం రిజర్వేషన్ లకు చట్టబద్ధత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కుల గణన సర్వే లో పాల్గొనని వారికి ఈనెల 16 నుండి 28 మధ్య మరోసారి సర్వే లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లకు బీసీ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధతకు శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా కేంద్ర పెద్దలతో అన్ని పార్టీలను తీసుకుపోయి చర్చిస్తామని ఈసందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్తెలిపారు. అనంతరం బీసీ కుల గణన చట్టబద్ధతకు కోసం కృషి చేస్తున్న టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి పొన్నం ప్రభాకర్ లను బీసీ సంఘాల నేతలు, ఫ్రొఫెసర్లు శాలువాలతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య , జజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్ కుమార్, వకుళాభరణం కృష్ణ మోహన్ , దాసు సురేష్, ఇతర బీసీ సంఘాల నేతలు , మేధావులు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు.






