ఢిల్లీలో చాయ్ వాలాగా Minister Mallareddy

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-12-14 08:18:04  IST  )

ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీలో చాయ్ వాలాగా Minister Mallareddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి వచ్చిన పలువురికి మంత్రి మల్లారెడ్డి ఛాయ్ ఇచ్చారు. ఆఫీసు వద్దకు వచ్చిన నాయకులకు మంత్రి మల్లారెడ్డి పలకరించి, చాయ్‌ కప్పులు పట్టుకుని వచ్చిన వారికి మంత్రి మల్లారెడ్డి ఛాయ్ పోసారు. పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి ఇలా చాయ్‌ వాలాగా మారడంతో చర్చనీయాంశంగా మారింది. జై మల్లన్న అంటూ పార్టీ నేతలు నినాదాలు చేశారు. కాగా, మల్లారెడ్డి ఈ విధంగా చాయ్ సర్వ్ చేయడంపై కొందరు చాయ్‌ వాలాగా మారిన మంత్రి మల్లారెడ్డి అంటూ విమర్శిస్తుంటే.. మరికొందరు అందరూ ఉన్నచోటు పదవులతో సంబంధం లేకుండా అంతా సమానంగా ఆనందంగా మెలగడం అంటే ఇదేనేమో అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ భవనంలో ఈ సీన్‌ తెరపైకి రావడంతో పలువురు హర్షం చేస్తున్నారు. దీంతో, మల్లారెడ్డి చాయ్ సర్వ్ చేస్తున్న వీడియోలు నెట్టింట హల్‌చల్ అవుతున్నాయి.

Also Read....

ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ!

Next Story