పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో 20% కార్మికులకు ఇవ్వాలి: మల్లారెడ్డి

by Ajay Maddhiboyina |

పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20% డబ్బులు పారిశ్రామిక కార్మికులకు ఇవ్వాల‌ని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి డిమాండ్ చేశారు. నేడు జ‌రిగిన‌ ట్రేడ్ యూనియన్ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మ‌ల్లారెడ్డి పాల్గొన్నారు.

పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో 20% కార్మికులకు ఇవ్వాలి: మల్లారెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20% డబ్బులు పారిశ్రామిక కార్మికులకు ఇవ్వాల‌ని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి డిమాండ్ చేశారు. నేడు జ‌రిగిన‌ ట్రేడ్ యూనియన్ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మ‌ల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచితే అందులో 20శాతం సినీ కార్మికుల‌కు ఇవ్వాల‌ని చ‌ట్టం తెస్తాన‌ని చెప్పాడ‌న్నారు. మ‌రి పారిశ్రామికవాడ‌ల భూములు అమ్మిన‌ప్పుడు కూడా కార్మికుల‌కు 20శాతం ఇవ్వాల‌నే చ‌ట్టం తీసుకురావాల‌న్నారు. చ‌ట్టం తీసుకువ‌చ్చి భూమి అమ్ముకోవ‌చ్చ‌న్నారు.

కేంద్రం కూడా కొత్త కొత్త చ‌ట్టాలు తీసుకువ‌చ్చి కార్మికుల‌ను మోసం చేసం చేయాల‌ని చూస్తోందన్నారు. కాబ‌ట్టి కార్మికులు మేల్కోవాల‌ని చెప్పారు. తెలంగాణ‌లో కార్మికుల‌కు ఈఎస్ఐలో అస‌లు మందులే లేవ‌న్నారు. న‌గ‌రంలోని ప‌రిశ్ర‌మ‌లు అన్ని అమ్మితే కార్మికుల కుటుంబాలు ఏమైపోవాల‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కొట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ, తాను ఉంటాన‌ని చెప్పారు. కార్మికులు ఢిల్లీకి వెళ్లేందుకు తాను రూ.10 ల‌క్ష‌లు ఖ‌ర్చుల కోసం ఇస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం కార్మికుల‌తోనే ఉంటుంద‌న్నారు.

Next Story