ఏపీలో BRS పోటీ చేసే స్థానాలివే.. Minister Mallareddy క్లారిటీ

by GSrikanth |   (  Updated:2023-01-02 02:56:18  IST  )

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులతో కలిసి మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో BRS పోటీ చేసే స్థానాలివే.. Minister Mallareddy క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులతో కలిసి మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు ఏపీలోనూ మంచి స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఏపీ ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకులు ఇప్పుడు దేశానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

Also Read...

బ్రేకింగ్: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Next Story