టీడీపీపై కేటీఆర్ ప్రశంసలు.. రెండు రాష్ట్రాల్లో హాట్‍ టాపిక్‍గా కేటీఆర్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-04-12 12:47:12  IST  )

పొత్తులపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకత్వ లక్షణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీపై కేటీఆర్ ప్రశంసలు.. రెండు రాష్ట్రాల్లో హాట్‍ టాపిక్‍గా కేటీఆర్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొత్తులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పొత్తులు మాకు కలిసి రావని, బీజేపీతో (BJP) ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. ఇవాళ మీడియాతో చిట్‍చాట్ నిర్వహించిన కేటీఆర్.. పదేళ్ల పాలనలో మాకు, ప్రజల మధ్య దూరం పెరిగిందని ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. టీడీపీలో (TDP) మంచి లక్షణాలు ఉన్నాయని, ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారు. మా పార్టీలో అది లోపించింది కాబట్టే ఓడిపోయామన్నారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమ అని హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్గార్గులం కాదన్నారు. డీలిమిటేన్ తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధం అన్నారు.

Next Story