- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో మరో అద్భుతం.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. లులూ మాల్స్ ఇప్పటివరకు ఏర్పాటు చేసిన అన్ని మాల్స్‌ను మించి కూకట్‌పల్లిలో అతిపెద్ద మాల్ ఏర్పాటు చేస్తున్నది. కూకట్‌పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను రీమోడలింగ్ చేసి లులూ మాల్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇందుకోసం లులూ గ్రూప్ సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 5 లక్షల చదరపు మీట్ల విస్తీరణంలో ఈ మాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మాల్ ద్వారా ఏకంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఇందులో 200కిపైగా దుకాణాలు ఉంటాయి. అంతేకాకుండా 5 సినిమా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ మెగా షాపింగ్ మాల్‌ను ఈనెల 26వ తేదీన ప్రారంభించనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మాల్‌ను ప్రారంభించనున్నారు. కాగా, ఇందులో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లలో ఒక్కో స్క్రీన్ కెపాసిటీ ఏకంగా 1400 సీట్లు కావడం విశేషం. ఒకేసారి 3 వేల కార్లను పార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ మాల్‌ను నిర్మించారు.