- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచివాలయంలో ఆ ఫైలుపై తొలి సంతకం చేసిన KTR
by GSrikanth |
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం అనంతరం తన చాంబర్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం అనంతరం తన చాంబర్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన మొదటి సంతకాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో మంత్రి కేటీఆర్‌కు మూడో అంతస్తు కార్యాలయం ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కీలకమైన ఫైలుపైన మొదటి సంతకం చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై తొలి సంతకం చేశారు.
Next Story






