- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెసోళ్లకు ఎందుకు కడుపుమంట..? ప్రశ్నల వర్షం కురిపించిన మంత్రి కేటీఆర్
పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా పలు పశ్నలతో నిలదీశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా పలు పశ్నలతో నిలదీశారు. ‘ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే రైతబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..? ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు..? అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు..? దుక్కిదున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకు..? అన్నం పెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..? కర్షకుడికి కడుపునిండా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకు..? 3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్ పీ మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు..? రైతుచేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కక్ష ఎందుకు..? దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకు..? కౌలు రైతులకు.. అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు..? అన్నదాతలారా.. మీ వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండి..! పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా..? ఆలోచించండి..! రైతుబంధువును ఆదరించండి..! రాబందులను తరిమికొట్టండి..!’ అని పేర్కొన్నారు.






