- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కేటీఆర్‌కు అమెరికాలో ఘనస్వాగతం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే ల

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే. తారకరామారావుకి ఈరోజు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్‌పోర్టులో మంత్రి కేటీఆర్ కి పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు.
మంత్రి కే తారకరామారావు లాస్ ఏంజిల్స్ లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.






