భద్రాచలం భూముల వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందన.. ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

భద్రాచలం భూముల వివాదంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పందించారు.

భద్రాచలం భూముల వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందన.. ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలం భూముల వివాదంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలం భూముల వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. ఏడు మండలాలు ఏపీలో కలవడం వల్లే ఈ గొడవలు మొదలయ్యాయి. ఆలయ భూముల్లో ఇప్పటికే 60 కట్టడాలు వచ్చాయి. చాలా రోజుల నుంచి వారికి నచ్చజెబుతున్నాం.. కానీ ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. ఈసారి ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై ఏపీలో కేసు నమోదు చేయాల్సి ఉంది. అందుకే తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఏపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాం. వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం రిక్వెస్ట్ చేశాం’ అని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.

వివరాల్లోకి వెళితే.. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నం(Purushottapatnam)లో భూములున్నాయి. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో భ‌ద్రాచ‌లం టెంపుల్‌ సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో త‌ర‌చూ ఘర్షణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా.. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు.

Next Story