తెలంగాణకు వ‌రంగ‌ల్‌ను రెండో రాజ‌ధానిగా చేద్దాం.. అధికారులకు మంత్రి సురేఖ కీలక సూచనలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-26 14:53:43  IST  )

వ‌రంగ‌ల్(Warangal) జిల్లాలో ప్రభుత్వ ప‌థ‌కాలు ప్రజ‌లకు చేరాలని.. జిల్లా క‌లెక్టర్లు ప్రభుత్వ పాఠ‌శాలలు, సంక్షేమ హాస్టల్‌లు, గురుకుల పాఠ‌శాల‌ల‌ను సీఎం ఆదేశాల మేరకు వారం

తెలంగాణకు వ‌రంగ‌ల్‌ను రెండో రాజ‌ధానిగా చేద్దాం.. అధికారులకు మంత్రి సురేఖ కీలక సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: వ‌రంగ‌ల్(Warangal) జిల్లాలో ప్రభుత్వ ప‌థ‌కాలు ప్రజ‌లకు చేరాలని.. జిల్లా క‌లెక్టర్లు ప్రభుత్వ పాఠ‌శాలలు, సంక్షేమ హాస్టల్‌లు, గురుకుల పాఠ‌శాల‌ల‌ను సీఎం ఆదేశాల మేరకు వారంలో ఒక‌టి, రెండుసార్లు సంద‌ర్శించాల‌ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వ్యాఖ్యానించారు. వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌గ‌తికి అధికారులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రివ్యూ స‌మావేశంలో మంత్రి కొండా సురేఖ కీల‌క సూచ‌న‌లు చేశారు. శ‌నివారం రాష్ట్ర స‌చివాల‌యంలో రివ్యూ మీటింగ్ జ‌రిగింది. వరంగల్ నగర అభివృద్ధి, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం, మెగా టెక్స్‌టైల్ పార్క్‌, భద్రకాళి దేవస్థానం, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔట‌ర్ రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై మంత్రులు సంయుక్తంగా స‌మీక్షించారు. ఈ స‌మావేశం ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌గా, మంత్రి సీత‌క్క‌, ప్ర‌భుత్వ అడ్వ‌ైజ‌ర్ వేం న‌రేంద‌ర్ రెడ్డి, మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ బండ ప్ర‌కాశ్, జిల్లాకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

మామునూరు ఎయిర్ పోర్టు నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కొండా సురేఖ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎయిర్ పోర్టుకి అవ‌స‌ర‌మైన ప‌నుల మీద దృష్టి సారించాల‌ని మంత్రి సురేఖ చెప్పారు. వెట‌ర్న‌రీ ఆసుప‌త్రులను క‌లెక్ట‌ర్లు, జిల్లా ఉన్న‌తాధికారులు ప్ర‌త్యేకంగా ప‌రిశీలించాల‌న్నారు. వ‌ర్షాకాలంలో ప‌శువులు ఇబ్బంది ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌కు అనుగుణంగా చారిత్రాత్మ‌క వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్ని సంక‌ల్పంతో పని చేయాలన్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, ఈ ప్రాధాన్య‌త‌ల‌ను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌న్నారు. వ‌రంగ‌ల్ అభివృద్దికి చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలకు సంబంధించిన డీపీఆర్‌, టెండ‌ర్‌, ప‌నులు ప్రారంభించ‌డానికి.. పూర్తి చేయ‌డానికి ఒక‌ ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకొని ప‌నిచేయాల‌ని సూచించారు. వ‌రంగ‌ల్ ప్రాంత చిర‌కాల స్వ‌ప్న‌మైన మామునూరు ఎయిర్ పోర్ట్ క‌ల త్వ‌ర‌లో సాకారం కానుంద‌ని అయితే ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ యుద్ధ ప్రాతిప‌దికన చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భూ సేక‌ర‌ణ‌కు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవ‌ని రెండు రోజుల క్రితం రూ. 205 కోట్లను విడుద‌ల చేసినట్టు చెప్పారు. కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు సంబంధించి ప్రగతి జరుగుతుందన్నారు. వెట‌ర్న‌రీ హాస్పిట‌ల్‌, ప్రాథమిక పాఠ‌శాల‌, గ్రామ పంచాయితీ కార్యాలయ భ‌వ‌నం నిర్మించాలు నిర్మించాలని చర్చించినట్టు చెప్పారు.

మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్థానిక యువ‌తకు ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు.రూ. 4,170 కోట్ల‌తో 2057 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్ధ‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించ‌డానికి వీలుగా పనుల‌ను విభ‌జించుకొని ద‌శ‌ల వారీగా చేప‌ట్టాల‌ని అధికారులకు సూచించారు. భ‌ద్ర‌కాళి ఆల‌య మాడ వీధుల‌తోపాటు క‌ల్యాణ మండ‌పం, పూజారి నివాసం, విద్యుత్ అలంక‌ర‌ణ‌లను వ‌చ్చే ద‌స‌రా నాటికి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకొని ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అమ్మ‌వారి ఆల‌య అభివృద్ది ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు తానే స్వ‌యంగా వ‌స్తాన‌ని చెప్పారు. రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జితో స‌హా అన్ని ప‌నులు వ‌చ్చే డిసెంబ‌ర్ క‌ల్లా పూర్తి చేయాల‌న్నారు.

Next Story