- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనహిత పాదయాత్రలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
జనహిత పాదయాత్ర(Janahita Padayatra)లో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జనహిత పాదయాత్ర(Janahita Padayatra)లో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ చోరీ బీజేపీ.. ల్యాండ్ చోరీ బీఆర్ఎస్ పార్టీలను బ్యాలెట్ మీద బొంద పెట్టాలని అన్నారు. ఆ రెండు పార్టీలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పాతాళం లోతుకి పాతి పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. యూరియా మీద రెండు పార్టీలు దొంగ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశమంతా చూస్తున్నది వారి రైతు వ్యతిరేక రాజకీయమని అన్నారు. ఇక ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నిలబెడితే.. బీజేపీ పెట్టిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని చూస్తున్నారు. ఇదీ వారి కపట వైఖరి అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక తాను ముక్కలే అని చెప్పారు. ఓట్ చోరీతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ చోరీ కాకుండా చూడాలని అన్నారు. అందుకోసం కాంగ్రెస్ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
‘నాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంతన్న ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పాదయాత్ర చేశారు. నేడు మహేషన్న కూడా ప్రజా సంక్షేమం కోసం జనహిత పాదయాత్ర చేస్తున్నారు. మహేశన్న పార్టీ ప్రెసిడెంట్ అయ్యాక గాంధీ భవన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ అధినేత ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెల్వదు. అధికారంలో ఉన్న నాయకులు పాదయాత్ర ఎప్పుడూ చేయలేదు. కానీ మన మహేశన్న ప్రజలతో మమేకం అయ్యేందుకు పాదయాత్ర చేయడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి రేవంతన్న, మహేషన్న, మీనాక్షి నటరాజన్‌కు గిఫ్ట్ ఇవ్వాలి’ అని కొండా సురేఖ అన్నారు.






