- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటివరకు మా పోరాటం ఆగదు.. మంత్రి కొండా సురేఖ ప్రకటన
బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం జరుగుతున్న పోరాటానికి మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఢిల్లీకి చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం జరుగుతున్న పోరాటానికి మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, మంత్రి సురేఖ నేతృత్వంలో పెద్ద ఎత్తున వరంగల్‌కు చెందిన బీసీలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... బీసీలకు రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం చేస్తామని అన్నారు. బుధవారం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా జరగనున్న నేపథ్యంలో... రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ఢిల్లీకి చేరకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు - విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఢిల్లీ జంతర్‌మంతర్‌లో బుధవారం మహాధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇవ్వగా, ఆయన ఆశయం నేరవేర్చేందుకు తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. రిజర్వేషన్లు సాధించేవరకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కారు మీద తాము పోరాటం చేస్తామన్నారు.






