ఆర్థిక సహకారం కూడా అందిస్తా.. మంత్రి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఏప్రిల్ 11న వరంగల్ పట్టణంలో టాస్క్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పిలుపునిచ్చారు.

ఆర్థిక సహకారం కూడా అందిస్తా.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ 11న వరంగల్ పట్టణంలో టాస్క్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పిలుపునిచ్చారు. సోమవారం హైద‌రాబాద్‌లోని మంత్రి నివాసంలో జాబ్ మేళా నిర్వాహ‌కులు, ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో టాస్కు సీఈఓ శ్రీకాంత్ సింహ, సీఆర్ఓ ప్ర‌దీప్ రెడ్డి, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి ఓఎస్డీ నార్ల సుమంత్‌, స్పెష‌ల్ ఆఫీస‌ర్ శ్రీరాముల శ్రీనివాస్ పాల్గొన్నారు.


కాగా, ఈ జాబ్‌ మేళ‌ల(Job Mela)కు హాజ‌ర‌వుతున్న కంపెనీల వివ‌రాలు మంత్రి సురేఖకి వారు వివ‌రించారు. అయితే, అత్య‌ధిక నిరుద్యోగ యువ‌తకి ఈ జాబ్ మేళ‌ను స‌ద్వినియోగం చేసుకునే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి వారికి సూచించారు. జాబ్ మేళా కి హాజరయ్యే వారికి భోజనం, మంచి నీటి ఏర్పాటు చేయాలని.. అందుకోసం తాను వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా సహకారం అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో.. ఎండలు బాగా ఉన్నాయని.. జాబ్ మేళాకు హాజరయ్యే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. అక్కడ రెండు లేదా మూడు అంబులెన్స్ కూడా జాబ్ మేళా వద్ద ఉంచాలని ఎవరికైనా నిరుద్యోగులకు ఆ సమయంలో అనారోగ్యం లేదా అస్వస్థత ఏర్పడితే వాటి ద్వారా వారికి వైద్య సదుపాయం అందించవచ్చని మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్, పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది రాకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకునేందుకు తగిన ప్రణాళికలు రచించాలని మంత్రి సురేఖ వెల్లడించారు. కాగా, వరంగల్ జిల్లా యువతీ యువకులందరూ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని, తమ పేరును నమోదు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వివ‌రాల‌ను మంత్రి స్వ‌యంగా తెలుసుకున్నారు. నిర్వాహకులు ఇటీవ‌ల మంత్రి చేత విడుదల చేయించిన పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి వరంగల్ లోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్‌లో ప్రారంభం అవుతుందని తెలిపారు.

Next Story