‘నేను, సీత‌క్క, క్రాంతి ముగ్గురం మ‌హిళ‌లమే’.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఆడ‌బిడ్డల పోరుగ‌డ్డ.. వ‌రంగ‌ల్‌లో టూరిజం శాఖ ఆధ్వ‌ర్యంలో తొలి బ‌తుక‌మ్మ వేడుక‌లు(Bathukamma festival) నిర్వ‌హించ‌డం హర్షించదగిన విషయం అని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.

‘నేను, సీత‌క్క, క్రాంతి ముగ్గురం మ‌హిళ‌లమే’.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆడ‌బిడ్డల పోరుగ‌డ్డ.. వ‌రంగ‌ల్‌లో టూరిజం శాఖ ఆధ్వ‌ర్యంలో తొలి బ‌తుక‌మ్మ వేడుక‌లు(Bathukamma festival) నిర్వ‌హించ‌డం హర్షించదగిన విషయం అని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. రాణిరుద్ర‌మ‌, స‌మ్మ‌క్క, సారక్క, చాక‌లి ఐల‌మ్మ‌, హ‌జారే మంగ‌మ్మ వంటి ధీనవనితలు పుట్టిన నేల ఓరుగ‌ల్లు అని ఆమె పేర్కొన్నారు. అటువంటి వరంగల్ జిల్లాలో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను మొదటిసారిగా నిర్వహించాలని నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచి పరిణామం అని అన్నారు. సోమ‌వారం త‌న స‌హ‌చ‌ర మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, సీత‌క్క‌, టూరిజం కార్పొరేష‌న్ ఎండీ వ‌ల్లూరి క్రాంతి, సాంస్కృతిక విభాగం సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ‌, బ‌తుక‌మ్మ పండుగ నిర్వాహ‌కురాలు దిల్లీశ్వరి పాల్గొన్నారు. అనంతరం బతుక‌మ్మ పోస్ట‌రును విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా సురేఖ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతీ, సాంప్ర‌దాయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంద‌న్నారు. పూలతో దేవున్ని కొలిచే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదని, ఇది తెలంగాణ ఆత్మ‌గౌర‌వ వేడుక అని సురేఖ వివ‌రించారు. మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే, సమాజాన్ని, కుటుంబాలను కలిపే పండుగ అని చెప్పారు. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేలా సంబరాలు చేస్తామ‌న్నారు. ప్రతి తెలంగాణవాసి గుండెల్లో పూల పరిమళంలా నిలిచేలా ఉత్సవం చేస్తామ‌న్నారు. మహిళలకు అత్యంత ప్రత్యేకమైన ఈ పండుగలో, ఎంగిలి పూలతో ప్రారంభించి తొమ్మిది రోజులు తీరొక్క పువ్వుతో బతుకమ్మ పేర్చి ఘనంగా జరుపుకుంటార‌న్నారు. బాధలను మరిచి, బంధువులతో కలిసి పాటలు పాడుతూ, కోలాటాలు, నృత్యాలతో ఉత్సాహంగా సాగే పండుగ బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ పండుగను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమ‌న్నారు.

Next Story