- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : కేటీఆర్ కు మంత్రి కొండా సురేఖ కౌంటర్
బీజేపీ(BJP) గెలుపుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)నే అతిపెద్ధ కార్యకర్త అంటూ..ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు అయనకు అభినందనలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసి ట్వీట్..వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP) గెలుపుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)నే అతిపెద్ధ కార్యకర్త అంటూ..ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు అయనకు అభినందనలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసి ట్వీట్..వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ నుంచి ఇలాంటి ప్రకటన ఆశ్చర్యంగా ఉందని..మీ పార్లమెంటరీ ప్రాంతం కరీంనగర్ లోక్ సభ స్థానంలో బీజేపీ రెండుసార్లు గెలిచిందని, అలాగే మీ సోదరి కవిత నిజమాబాద్ లో 2019ఎన్నికల్లో ఓడిపోయిందన్న సంగతి మరువరాదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మీరు చేయవలసిన మొదటి పని మీ "మోదీ అంకుల్" గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు మీ సోదరిని అభినందించడమని..ఎందుకంటే ఈ ఫలితాన్ని రూపొందించడంలో ఆమె చేసిన ప్రయత్నాలు స్పష్టంగా ఉన్నాయని.. గుర్తింపుకు అర్హమైనవి కూడా అని..అది అంగీకరించడం న్యాయంగా ఉంటుందంటూ పరోక్షంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల్లో రాజ్యాంగానికి మించిన వారు ఎవరూ లేరని మోదీకి అర్థమయ్యేలా చేశారన్నారు. వారి నాయకత్వం మీ కుటుంబానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని (LOP) పదవిని కట్టబెట్టడంలో సహాయపడిందని..అయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికలలో సున్నా సీట్లతో మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని మంత్రి సురేఖ విమర్శించారు. రాహుల్ గాంధీ బలమైన ప్రభావాన్ని విస్మరించవద్దని.. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా వెనుకాడుతోందని..ఈ నష్టం బీఆర్ఎస్ మరో ఎన్నికల పోరులోకి అడుగు పెట్టడానికి ఇష్టపడకుండా పోయిందని గుర్తు చేశారు. అందుకే ప్రకటనలు చేస్తున్నప్పుడు, నిజంగా అర్హులైన వారిని అభినందించడం మర్చిపోవద్ధని నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ కేటీఆర్ అంటూ కొండా సురేఖ సెటైర్ వేశారు.






