Konda Surekha: దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు.. మంత్రి కొండా సురేఖ హెచ్చరిక

by Ramesh Naini |

దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టి శిక్షిస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.

Konda Surekha: దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు.. మంత్రి కొండా సురేఖ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: (endowment lands) దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు (PD Act) పెట్టి శిక్షిస్తామని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల ఐఓసీ వద్ద అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. బోడుప్పల్ పరిధిలో మూడు సర్వే నెంబర్లలో ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 30 ఎకరాలకుపైగా దేవాదాయ స్థలం ఉందని తెలిపారు. ఈ భూమిని కొంత మంది ఆక్రమించుకొని నిర్మాణాలు చెప్పట్టినట్లు తెలిపారు.

దేవాదాయ భూములు, తమ భూములకు రక్షణ కల్పించాలని కొంత మంది లోకల్ బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇవాళ వరంగల్ వెళ్తున్న క్రమంలో ఇక్కడి ఆగి భూములను అధికారుల సమక్షంలో పరిశీలించినట్లు తెలిపారు. ఈ భూములపై సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రిపోర్టు ఆధారంగా సమావేశం ఏర్పాటు చేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story