- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister: హిందూ ధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటిది
హిందూధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటిదని, అదే హిందూ ధర్మం గొప్పతనమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హిందూధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటిదని, అదే హిందూ ధర్మం గొప్పతనమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. రామరాజ్యం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రావణ రాజ్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి స్పష్టం చేశారు. కొందరు దుండగుల దాడిలో గాయపడి తీవ్ర విచారంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్(Priest Rangarajan)తో పాటు వారి తండ్రి సౌందర రాజన్‌ను మంత్రి సురేఖ వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి అన్నివేళలా అండగా వుంటుందని మంత్రి వారి కుటుంబానికి భరోసానిచ్చారు.
సీఎస్ రంగరాజన్‌పై జరిగిన దాడిని మంత్రి సురేఖ తీవ్రంగా ఖండించారు. సంఘవ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాముని పేరుతో రాజకీయాలు చేస్తూ, ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసే చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు. ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని, తమ నమ్మకాలను ఇతరుల పై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి అన్నారు. తన జీవిత పర్యంతం ధర్మానికే కట్టుబడి జీవించిన శ్రీరాముని పేరుతో హింసకు పాల్పడటం విచారకరమని అన్నారు. ఈ దాడికి కారకులైన వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు.






