- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కొండా సురేఖ టంగ్ స్లిప్.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వివాదం..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

దిశ, హనుమకొండ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం వరంగల్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన అధికారిక వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం దుమారం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన జూన్ 2ను పురస్కరించుకుని జరిపే వేడుకల్లో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
మంత్రి పదవిలో ఉన్న మహిళకు ఈ రెండు ముఖ్యమైన దినోత్సవాల మధ్య తేడా తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మర్చిపోయి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారిక వేదికపై పదవిలో ఉన్న నేతలు మాట్లాడే మాటల్లో స్పష్టత ఉండాలని, అప్రమత్తత అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






