- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చాలా థాంక్స్ రేవంతన్నా’.. మంత్రి సురేఖ హర్షం
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు(Mamnoor Airport) నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు(Mamnoor Airport) నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు చెప్పారు. రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు వివరించారు. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించారు.
గత నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తాము జిల్లా ఇంఛార్జీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కృషి చేస్తున్నట్టు వివరించారు. కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగా మామునూరు ఉండాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు. సుమారు 1,000 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్టు పూర్తయితే, మామునూరు విమానాశ్రయం ప్రారంభమైతే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి అక్కడికి వెళ్లే రహదారుల వెంట అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి సురేఖ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కూడా పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.






