- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఈవోలపై దాడిచేస్తే ఊరుకోం.. మంత్రి కొండా సురేఖ హెచ్చరిక
భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి(Bhadrachalam EO Ramadevi)పై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి(Bhadrachalam EO Ramadevi)పై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఈ దాడి ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడైనా... రూల్స్ విరుద్ధంగా ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్టు పెడుతామని హెచ్చరించారు. ఈ విషయంలో గతంలోనూ తాము స్పష్టం చేశామని గుర్తుచేశారు. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం(ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవిపై దాడి చేయడం సహేతుకం కాదన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని... సమస్యను పరిష్కారం చేయాలని రిక్వెస్ట్ చేశారు.
బ్యాక్‌గ్రౌండ్ విషయం ఏంటీ?
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూములున్న విషయం విదితమే. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో భద్రాచలం టెంపుల్ సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో తరచూ ఘర్షణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా.. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు.
పురుషోత్తపట్నంలోకి ప్రవేశించే మార్గంలో పిల్లర్లతో నిర్మాణ పనులు చేపడుతున్నారనే సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేయవద్దని, ఇది పూర్తిగా రాముడి భూమి అని వివరించారు. కోర్టు తీర్పులతో దేవుడి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే, ఈవో అభ్యంతరాలు వినకుండా... స్థానికులు ఈవోపై దాడి చేశారు. దీంతో ఆమె సృహా కోల్పోయిన పరిస్థితి నెలకొంది.






