- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Konda Surekha: e-ఆఫీస్ @దేవాదాయశాఖ.. ఇకపై ఫైల్స్ అన్ని అన్‌లైన్‌లోనే..! మంత్రి కొండా సురేఖ
తెలంగాణ దేవాదాయ శాఖకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ దేవాదాయ శాఖ (Endowment Department)కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ప్రకటించారు. దేవాదాయ శాఖలో కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక నుంచి e-ఫైల్స్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. పారదర్శకంగా, మెరుగైన ఫలితాలు తెచ్చేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. దేవాదాయ శాఖలో ఇది విప్లవాత్మకమైన నిర్ణయం అని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యాలయం పూర్తిగా (e-ఆఫీస్ ) e- ఆఫీస్, ఫైల్స్ అన్నీ ఆన్లైన్ లోనే ఉంటాయని తెలిపారు. త్వరలో జిల్లా కార్యాలయాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై నెటిజన్‌లు అభినందనలు తెలిపారు. నేటి డిజిటల్ యుగానికి తగ్గట్లుగా ఉండాలని నెటిజన్‌లు అభిప్రాయం తెలిపారు. ట్వీట్ లింక్..






