బోనాల పండుగ ఈసారి అదిరిపోవాలి: అధికారులకు మంత్రి ఆదేశం

by Gantepaka Srikanth |

ఆషాడమాస బోనాల(Bonala Festival)పై అధికారులతో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హైదరాబాద్‌లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

బోనాల పండుగ ఈసారి అదిరిపోవాలి: అధికారులకు మంత్రి ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్: ఆషాడమాస బోనాల(Bonala Festival)పై అధికారులతో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హైదరాబాద్‌లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. మొత్తం 28 ఆయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలి. బడ్జెట్ లోటు కూడా లేదు.. ప్రభుత్వం నుండి ఇప్పటికే రూ.20 కోట్లు కేటాయించాం. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది.. ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేదానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్ళాలని అన్నారు.

ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. కాగా, గోల్కోండ కోటలో బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయి. ఆషాడ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ విశేష పూజలు జరుగుతాయి. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ వారం సికింద్రాబాద్‌ అంతటా బోనాలు జరుపుకుంటారు. ఆ తర్వాతి నుంచి లాల్‌ దర్వజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల జరుగుతాయి.




Next Story