- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
van mahotsav: తెలంగాణలో వన మహోత్సవం.. ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింప చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వన మహోత్సవం పేరిట చేపడుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింప చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని (Vana Mahotsavam) వన మహోత్సవం పేరిట చేపడుతోంది. అయితే, ఈ ఏడాది అందుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఎంఏ యూడీ సెక్రటరీ టీకే శ్రీదేవి, ప్రియాంక వర్గీస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జూన్ మొదటి వారంలో మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని అధికారులు సిద్ధం చేసిన పీపీటీని మంత్రికి నివేదించారు.






