- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడు మన టాస్క్ ఇదే.. అధికారులకు కొండా సురేఖ కీలక ఆదేశాలు
by GSrikanth |
ప్లాస్టిక్‌ను నియంత్రించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె సచివాలయంలో రివ్యూ నిర్వహించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్లాస్టిక్‌ను నియంత్రించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్లాస్టిక్‌ను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆఫీసర్లు కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వెరీ డేంజర్ అన్నారు. పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఎలా ఇస్తున్నామో? నిత్య జీవితంలోనూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్, స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. త్వరలో వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
Next Story






