- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఎల్లవేళలా అండగా ఉంటా’.. బాధితులకు మంత్రి కొండా సురేఖ భరోసా
స్టేట్ ఎండోమెంట్ శాఖ(State Endowment Department) పరిధిలోని పలువురికి డెత్ గ్రాట్యూటీ(Death Gratuity) సత్వరంగా ఇప్పించినందుకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కి బాధిత కుటుంబీకులు ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ ఎండోమెంట్ శాఖ(State Endowment Department) పరిధిలోని పలువురికి డెత్ గ్రాట్యూటీ(Death Gratuity) సత్వరంగా ఇప్పించినందుకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కి బాధిత కుటుంబీకులు ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని తన పేషీలో 20 బాధిత కుటుంబాలకు రూ. కోటి ఐదు లక్షలు స్వయంగా ఇచ్చారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆరుగురు ఎండోమెంటు ఉద్యోగుల కుటుంబాలకు, రిటైర్ అయిన ఉద్యోగులకు, ఉపనయనం బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ లోన్ సంబంధిత సాయాలను అందజేశారు. అయితే, ఈ గ్రాట్యూటీ ప్రక్రియను వేగవంతం చేసి, తమకు గ్రాట్యూటీ ఫండ్ త్వరితగతిన వచ్చేందుకు సాయం చేసిన మంత్రి సురేఖకు బాధిత కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ... ఎండోమెంటు ఉద్యోగులకు ఎటువంటి కష్టం వచ్చినా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాగోగులను మంత్రి సురేఖ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మంత్రితో తమ సమస్యలు చెప్పుకుంటూ వాపోయారు.
డ్యూటీలో తమ భర్త చనిపోవడంతో తమ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని మంత్రి దృష్టికి పలువురు మహిళలు తీసుకొచ్చారు. అయితే, ఆర్థిక ఇబ్బంది ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు ఏదైనా మార్గాలను అన్వేషించి, తగు న్యాయం చేయాలని ఎండోమెంటు ఉన్నతాధికారులను ఆదేశించారు. మన దేవాదాయ శాఖ కోసం సేవలు అందిస్తున్న క్రమంలో మరణించిన వారి కుటుంబాలకు కేవలం గ్రాట్యూటీ ఇచ్చి సరిపెట్టొద్దని, ఎక్కడ... ఏ విధంగా సాధ్యమైనా మన బాధ్యతగా సాయం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సురేఖ గుర్తు చేశారు. మంత్రి సురేఖ స్పందనకు బాధిత మహిళలు కన్నీరు పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వారిని మంత్రి సురేఖ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, వెంకటేశ్, రామకృష్ణరావు, పీఎస్ సోమరాజు, ఓఎస్డీ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.






